గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలి వదిలేశారు. సొంత జిల్లాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడో చూస్తుంటే కనిపిస్తుంది అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఎలాంటి అభివృద్ధి చేశారో ఇక్కడ చూస్తుంటే కనపడుతుంది. కడప జిల్లా ప్రజలు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డికి ఎన్నో సీట్లు ఇచ్చారు కానీ సొంత జిల్లా కడపను అభివృద్ధి చేయలేదని ప్రజలు గుర్తించి ఎన్డీఏ కూటమికి అవకాశం ఇచ్చారు.
రెవెన్యూ వ్యవస్థను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నుల్లో సర్వనాశనం చేసి దోపిడీకి పాల్పడ్డారు. గత వైయస్సార్ ప్రభుత్వం ఏమి చేసిందయ్యా గొప్పగా అభివృద్ధి అంటే.. లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పేర్లు పెట్టినా ఆ కుటుంబానికి చెల్లుతుంది. పైన ముఖ్యమంత్రి, కింద మంత్రులు కలిసి దోపిడీ చేశారు. గత ఐదు సంవత్సరాలలో ప్రజలను, పరిపాలనను గాలికి వదిలేసారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఫ్రీ హోల్డ్ భూములపై విచారణ చేయిస్తున్నాం. మదనపల్లి సబ్ కలెక్టర్ దగ్ధం కేసులో ఎవరున్నారో వారిని బయటికి తీసుకొస్తాం అని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.