తెలంగాణ లో ప్రస్తుతం రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తరువాత బీఆర్ఎస్ నుంచి అధికంగా కాంగ్రెస్ లోకి వలసలు వెళ్తున్నారు. కొంత మంది బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ లోకి వెళ్లి టికెట్లు దక్కించుకుంటున్నారు.
మరికొందరూ కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలకు కూడా వెళ్తున్నారు. మొత్తానికి ఎవరికైతే టికెట్ దక్కదో వారు ఇతర పార్టీలతో చర్చలు జరిపి టికెట్ దక్కించుకుంటున్నారు. తాజాగా నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథ్ కాంగ్రెస్ పార్టీని వీడారు. రేపు ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతిని మందా జగన్నాథం కలవనున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.