తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని దేశ ప్రధాని మోడీ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ… ఇవాళ రెండో రోజు తెలంగాణ ప్రజలతో ఉండటం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు.
సంగారెడ్డి నుంచి రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు నరేంద్ర మోడీ. తెలంగాణకు ఏది కావాలన్నా ఇస్తామని చెప్పారు. ఇక అంతకు ముందు ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ….అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పటాన్‌చెరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్న మోదీ… తెలంగాణ పర్యటన ముగించుకుని ఒరిస్సాకు పయనం కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.