హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భారీగా అవకతవకలు ?

“చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి అన్ని చిల్లర పనులు” అన్నట్లుగానే తయారయింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల వ్యవహారం. అచ్చం పొలిటికల్ ఎన్నికల తరహాలోనే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా నిన్న జరిగాయి. మెయిన్ ఎన్నికలు, “మా” ఎన్నికల తరహాలోనే ఈ జర్నలిస్టు ఎన్నికల్లోనూ రిగ్గింగ్, దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రోజున ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కు చెందిన కొత్త కార్యవర్గం కోసం జరిగిన ఎన్నికల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయి.

బ్యాలెట్ పేపర్ పైన ఓటు వేయడానికి స్వస్తిక్ గుర్తు ను మాత్రమే ఉపయోగించాలి. కానీ నిన్న నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో… స్వస్తిక్ గుర్తుతో పాటు… కొన్ని బ్యాలెట్ పేపర్ లపై రౌండ్ సీలు, మరి కొన్ని బ్యాలెట్ పేపర్ ల పైన ఇంటూ గుర్తులు ఉన్నాయి. ఇక ఇది గమనించిన ప్రెసిడెంట్ అభ్యర్థి సూరజ్ భరద్వాజ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన అభ్యంతరాన్ని తెలియజేశాడు.

అదేవిధంగా పోలైన మొత్తం ఓట్లు, అభ్యర్థులకు పడ్డ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్లు అస్సలు టాలీ కావడం లేదు. అంటే మొత్తం ఓట్లలో కొన్ని గల్లంతయ్యాయి అన్నమాట. ఈ అంశాలపై ప్రధానంగా అభ్యంతరం తెలపడంతో… స్వస్తిక్ గుర్తు కు బదులు రౌండ్ సిల్ ఎలా వచ్చింది… ఇంటూ గుర్తు ఎలా వచ్చింది అనేదానిపై క్లారిటీ వచ్చే వరకూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి నిలిపివేశారు. దీనిపై విచారణకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ విచారణలో ఎవరు దోషులుగా తేలుతారో చూడాలి.