చంచల్‌గూడ జైలుకు ఎంబీఎస్‌ జువెల్లర్స్‌ డైరెక్టర్‌ సుకేశ్‌ గుప్తా

-

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ముసద్దీలాల్ జువెల్లర్స్ డైరెక్టర్ సుకేశ్ గుప్తాను ఈడీ అధికారులు కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు వచ్చే నెల 5వరకు సుకేశ్ గుప్తాకు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయణ్ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

మంగళవారం రాత్రి సుకేశ్‌ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు వాంగ్మూలం రికార్డు చేసుకున్నారు. అనంతరం సీసీఎస్‌ కార్యాలయంలో ఉంచారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీసీఎస్‌ నుంచి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి అనంతరం వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. కింగ్‌ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపర్చారు.

సుకేశ్‌ గుప్తాకు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ రంగ సంస్థ మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌(ఎంఎంటీసీ)నుంచి ఎంబీఎస్‌ జ్యుయెలర్స్‌ 2011 వరకు భారీగా బంగారం కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.503 కోట్లకు చేరింది. ఎంఎంటీసీ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ఈడీ అధికారులు సైతం మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news