సంక్రాంతికి చిరు, బాలయ్య పోటీ! మధ్యలో యంగ్ హీరో కూడా.!

-

సంక్రాంతి పండుగను తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరుపుతారు. పండుగ జరిగే రోజుల్లో ఎంత చెత్త సినిమా వున్న, అది మంచి థియేటర్ కాకపోయినా హౌస్ ఫుల్ అవుతుంది. అందుకే హీరోలు సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇలాంటి పోటీ మెగాస్టార్ చిరంజీవి మరియు బాలయ్య మధ్య వుందని అంటుంటే ఇప్పుడు మరో యంగ్ హీరో సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటున్నాడట. ఇప్పుడు సినిమాల మధ్య మరింత పోటీ ఎక్కువగా వుండే అవకాశం ఉందని అంటున్నారు.

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న #MEGA154  సంక్రాంతి పండుగకు వస్తామని ముందే చెప్పింది.ఇప్పుడు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK107 సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. దీనితో  ఇప్పుడు బాలయ్య కూడా సంక్రాంతి బరిలో ఉంటున్నారట. వాస్తవానికి గతంలో తన సినిమా సంక్రాంతి కి వచ్చేది. అలాగే దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ్ హీరో విజయ్ సినిమా కూడా సంక్రాంతికే విడుదల అవుతోంది.

అయితే వీరందరి మధ్య మరో యంగ్ హీరో కూడా నేనున్నా అంటూ రావాలని చూస్తున్నారట. హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్”. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోంది.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్  ను ఖచ్చితం గా సంక్రాతికి రిలీజ్ చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పందెం కోళ్ల లాగా, ఇన్ని సినిమాలు, ఇంత మంది  హీరోలు బరిలో నిలిస్తే ,కొన్ని సినిమాలకు దెబ్బ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news