తెలంగాణ కుంభమేళాగా పేరు ఉన్న మేడారం జాతర సందడి మొదలైంది. వచ్చే బుధవారం నుంచి సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభకానుంది. ఈ మహా జాతరకు సీఎం కేసీఆర్ కూడా రానున్నారు. కాగ ఈ జాతరకు రెండు వారాల ముందు నుంచే.. గుడిమెలిగే, మండమెలిగే అనే పండుగలను నిర్వహిస్తారు. గత బుధవారం గుడిమెలిగే పండుగను చేసి జాతరను ప్రారంభించారు. నేడు మండమెలిగే పండుగను నిర్వహిస్తున్నారు.
మండమెలిగే పండుక సందర్భంగా నేడు ఉదయం తెల్లవారు జామునే సమ్మక్క – సారలమ్మ గద్దెలను కడికి పూజాలు చేస్తారు. అలాగే ముగ్గులు కూడా వేస్తారు. అనంతరం వాయిద్యాలతో పసుపు, కుంకుమలతో మేడారం గ్రామం చుట్టూ ఊరేగిస్తారు. అలాగే దిష్టి తోరణాలను కూడా కడుతారు. ఇలా చేయడం వల్ల మేడారం గ్రామంలోనికి దుష్ట శక్తులు రావని నమ్ముతారు. అలాగే ఈ రోజు రాత్రి సమ్మక్క – సారలమ్మ లకు నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం పూజలు చేస్తు జాగారాలు కూడా చేస్తారు. అలాగే ఈ రోజు రాత్రి సమ్మక్క – సారలమ్మ దర్శనాలు కూడా నిలిపి వేయనున్నారు.