మేడిగడ్డ బ్యారేజి నా.. బొందల గడ్డ నో ముందు తేల్చండి కేసీఆర్.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

-

మేడిగడ్డ బ్యారేజి నా.. బొందల గడ్డ నో ముందు తేల్చండి కేసీఆర్ అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్గొండ సభలో.. కేసీఆర్ మేడిగడ్డ నా బొందల గడ్డనా ..అక్కడ ఏం పీకనికి పోతున్నారు అన్నాడు కేసీఆర్. నీ అవినీతిని పీకనికి పోయినం కేసీఆర్ అని పేర్కొన్నారు.  నువ్వు కట్టిన సంచులు పీకనికి పోయాం అన్నారు.  ఇప్పుడు కేటీఆర్..హరీష్ నీతులు చెబుతున్నాడు.

రేవంత్ మాటలు గురించి మాట్లాడే వీళ్లు.. కేసీఆర్ మాటలు తప్పు అని ఎందుకు చెప్పరు అని ప్రశ్నించారు.  మీ మేనమామా కు చెప్పు..మనం కూడా ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పు.  కేటీఆర్.. నువ్వు నాయనా నువ్వు అట్లా అనకు అని చెప్పు.  కేసీఆర్ ఒకటి అంటే..మేము వంద అంటాం అన్నారు.  తొమ్మిదేళ్లు సంచులు నింపుకున్నది మీరు..మేడిగడ్డ బ్యారేజి నా.. బొందల గడ్డ నో ముందు తేల్చండి కేసీఆర్. ఫస్ట్  తెలంగాణ ప్రజలకు దీనిపై క్లారిటీ ఇవ్వు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news