తెలంగాణకు పెట్టుబడుల వర్షం.. ముందుకొచ్చిన మరో దిగ్గజ సంస్థ

-

తెలంగాణకు పెట్టుబడుల వర్షం కురుస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అంతర్జాతీయ సంస్థలతో సమావేశమవుతూ పెట్టుబడులు తీసుకువస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వైద్య పరికరాలను తయారు చేసే మెడ్‌ట్రానిక్‌ సంస్థ.. రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. న్యూయార్క్​లో సంస్థ ప్రతినిధులను కలిసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ మేరకు వెల్లడించారు.

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన మెడ్‌ ట్రానిక్స్ సంస్థకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని మెడికల్ హబ్​గా బలోపేతం చేసేందుకు ఈ సంస్థ కార్యకలాపాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని ఆయన వివరించారు.

ఇటీవలే మంత్రి కేటీఆర్ లండన్​లో పర్యటించి పెట్టుబడులు తీసుకువచ్చారు. లండన్‌ స్టాక్​ ఎక్స్ఛేంజ్ గ్రూప్‌ హైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వచ్చే సంవత్సర కాలం నాటికి ఈ కేంద్రం ద్వారా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news