రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మీర్‌పేట్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. ఈ కేసు వివరాలను చౌహాన్ మీడియాకు వెల్లడిస్తూ.. నిందితులపై పోక్సో యాక్టు, సెక్షన్ 5జీ రెడ్‌విత్ 6 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు మంగళ్‌హాట్‌లో రౌడీషీటర్‌గా ఉన్నాడని వివరించారు.
“మీర్‌పేటలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆరుగురిని అరెస్టు చేశాం. ఈ ఘటనలో మరొక నిందితుడు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం 12 బృందాలతో గాలించాం. ప్రధాన నిందితుడు మంగళ్‌హాట్ రౌడీషీటర్ అబిద్‌గా గుర్తించాం. నిందితులు అషరఫ్, చిన్న, మహేశ్, తెహసీన్‌గా గుర్తించాం. ఘటన తర్వాత అబిద్ సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి పారేశాడు. నిందితులు మరొకరి సెల్‌ఫోన్‌తో మాట్లాడినట్లు గుర్తించాం. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా.. సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితులను పట్టుకున్నాం” అని సీపీ చౌహాన్ వెల్లడించారు.