హైదరాబాద్ ప్రయాణికులు బిగ్ షాక్ తగిలింది. మెట్రో టికెట్ ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది యాజమాన్యం. మెట్రో ఛార్జీలను 25 నుంచి 30% వరకు పెంచేందుకు కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచిన ధరలను అమలు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఈ చార్జీల పెంపునకు సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు ముగ్గురు సభ్యులతో ఫెయిర్ ఫికేషన్స్ కమిటీని ఏర్పాటు చేసింది హైదరాబాద్ మెట్రో యాజమాన్యం. ఈ కమిటీకి ఈ మెయిల్స్ ద్వారా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలిపేందుకు విధించిన గడువు నేటితో ముగియనుండగా ఇప్పటికే చాలామంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, ప్రజలను విభిన్నమైన సలహాలు, సూచనలు వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.