ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్

-

తెలంగాణ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమిళిసై రాజీనామాపై మంత్రి అనితా రాధాకృష్ణన్‌ స్పందించారు. ఎన్నికల ఫలితాలు మారితే ఉపరాష్ట్రపతి కావొచ్చని తమిళిసై భావిస్తున్నారని విమర్శించారు. కన్నియాకుమరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు మారితే ఉపరాష్ట్రపతి కావొచ్చని తమిళిసై భావిస్తున్నారని అందుకే గవర్నర్ పదవికి రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు.

మరోవైపు రాష్ట్ర గవర్నర్‌ సహా అదనపు బాధ్యతల్లో ఉన్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడుకు చెందిన ఆమె 2019 సెప్టెంబర్ 8న రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చారు. 2021 ఫిబ్రవరి 18నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై… 2019 ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి కణిమొళి చేతిలో ఓటమిపాలయ్యారు. తెలంగాణ ప్రజలకు తనపై చూపిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తమిళిసై తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news