తెలంగాణ లోక్ సభ ఎన్నికల విధుల్లో 1.80 లక్షల మంది సిబ్బంది

-

రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేడి షురూ అయింది. ఓవైపు ప్రధాన పార్టీలో ఎన్నికల క్షేత్ర్ంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుంటే మరోవైపు అధికారులు ఎలక్షన్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల కోసం సుమారు 1.80 లక్షల మంది సిబ్బందిని, శాంతి భద్రతల పరిరక్షణకు 60 వేల మంది సిబ్బందితో పాటు 145 కంపెనీల సీఐఎస్‌ఎఫ్‌ వారిని వినియోగించనున్నట్లు వెల్లడించారు. అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు 24 గంటలూ పని చేసేలా ఏర్పాట్లు చేశామన్న ఆయన.. అన్నిటినీ సీసీ కెమెరాలతో అనుసంధానం చేశామని వివరించారు.

మరోవైపు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున.. రూ.50 వేలకు పైగా నగదును వెంట తీసుకువెళ్లే వారు అందుకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని, లేకుంటే అధికారులు స్వాధీనం చేసుకుంటారని వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. ఓటు నమోదుకు ఏప్రిల్‌ 15 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఈసారి 85 ఏళ్లు దాటిన వారికే ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం ఉంటుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news