CPR గురించి దేశంలో 98% మందికి తెలియకపోవటం బాధాకరం : హరీశ్ రావు

-

మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలు అనారోగ్యానికి దారి తీస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇప్పుడు అనేక మంది గుండె వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద కార్డియాలజిస్ట్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

ఉన్నట్టుండి గుండె పనిచేయటం ఆగిపోయిన వారిని సీపీఆర్ చేయటం ద్వారా కాపాడుకోవచ్చని హరీశ్ రావు అన్నారు. కానీ.. అత్యంత అవసరమైన సీపీఆర్ గురించి దేశంలో 98 శాతం మందికి తెలియకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రజలకు సీపీఆర్​లో శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు.  ఇందుకోసం 1262 ఏఈడీ మిషన్లు కొనుగోలుచేసి  అన్ని సీహెచ్ సీలు,  యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు వివరించారు.

ఒకప్పుడు కమ్యూనికబుల్ వ్యాధులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అధికమవుతున్నాయని మంత్రి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం రాష్ట్రంలో 24 శాతం షుగర్, 14 శాతం బీపీతో బాధపడుతున్నట్లు తేలిందని చెప్పారు. ప్రభుత్వం బీపీ, షుగర్ మందులను ఉచితంగా అందిస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news