తెలంగాణలో డయాగ్నస్టిక్‌ మొబైల్‌ యాప్‌ ప్రారంభం..దేశంలోనే తొలిసారిగా

-

తెలంగాణ ప్రజల ఆరోగ్య వివరాలు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్‌ ఫోన్‌ లో చూసుకునే విధంగా దేశంలోనే తొలిసారిగా కేసీఆర్‌ సర్కార్‌‌ తెలంగాణ డయాగ్నస్టిక్‌ మొబైల్‌ యాప్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ప్రతి ఒక్కరి ఆరోగ్య నివేదికలు నిక్షిప్తమై ఉంటాయి.

ప్రభుత్వ వైద్య శాలలు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో ఎక్కడైనా ఒక చోట పరీక్షలు చేయిస్తే.. ఆ పరీక్షల రిపోర్టుల వివరాలు ఇందులో అప్లోడ్‌ చేస్తారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లినా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు.

తెలంగాణ డయాగ్నస్టిక్‌ యాప్‌ ప్రత్యేకతలు
———————————
★ ఈ యాప్‌ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య
వివరాలు తెలుసుకోవచ్చు

★ వైద్య పరీక్షల వివరాలు, రిపోర్టులను
డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

★ దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖాన
వివరాలు తెలుసుకోవచ్చు

★ పరీక్షలను బట్టి అందుబాటులో ఉన్న
దవాఖానను ఎంచుకోవచ్చు

★ వైద్యులు, నర్సులు, సిబ్బంది,
ఆశా సిబ్బంది, ఆసుపత్రుల సేవలపై

★ అభిప్రాయాన్ని యాప్‌లో నమోదు చేయవచ్చు.

★ వైద్యసేవలపై అసౌకర్యం కలిగితే
ఫిర్యాదు చేయవచ్చు

★ జరుగుతున్న వైద్య పరీక్షల
స్టేటస్‌ తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news