కారు కథ కంచికి చేరుతున్నా.. కేసీఆర్ మౌనముద్ర..

-

తెలంగాణా సెంటిమెంట్ తో టీఆర్ ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ ను ఖతం చేసిన సెంటిమెంట్ ను రాజేసింది.. జాతీయ స్థాయిలో ఎంటర్ అయ్యేందుకు టీఆర్ ఎస్ కాస్త బిఆర్ ఎస్ గా మార్చుకుని కేసీఆర్ అక్కడ చక్రం తిప్పాలనుకున్నారు.. బిజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని.. అన్ని పార్టీలను ప్రోత్సాహించారు.. కొన్నాళ్లకు దాన్ని పక్కన పెట్టేశారు.. అయితే ఈ ధపా జరిగిన ఎన్నికల్లో బీఆర్ ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడవంతో ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయనే ప్రచారం నడుస్తోంది..

రోజుకో ఎమ్మెల్యే కారు దిగి.. హస్తం గూటికి చేరుతున్నారు.. మరో పక్క కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.. బిజేపీలో బిఆర్ ఎస్ విలీనం అవుతుందని ఘాటైన విమర్శలు చేస్తున్నారు.. దీనికి కేటీఆర్, హరీష్ రావులు కౌంటర్లు ఇస్తున్నా.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు.. కాంగ్రెస్ , బీజేపీ రాజకీయాలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. ఆయన మాత్రం మీడియా ముందుకు రావడం లేదు..

కాంగ్రెస్, బిజేపీలకు బీఆర్ ఎస్ టార్గెట్ గా మారింది.. రెండు పార్టీలూ.. ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.. కానీ బిఆర్ ఎస్ క్యాడర్ లో మాత్రం విలీనం చర్చ తారాస్థాయికి చేరింది.. కేసీఆర్ మౌనంగా ఉండటం ఆ ప్రచారాలకు బలం చేకూర్చినట్లవుతుందని స్వంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.. ఈ ప్రచారంపై కేసీఆర్ స్పందిస్తే.. క్యాడర్ లో దైర్యం వస్తుందని.. లేదంటే కాంగ్రెస్ ప్రచారాలు నిజమనుకునే ప్రమాదముందని బీఆర్ ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారు.. ఈ వ్యవహారంపై గులాబీ బాస్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news