మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేయాలి : ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు

-

నల్గొండ జిల్లాలో ల్యాండ్  ఆర్డర్ పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా అమాయకుల్ని, బాధితులని పోలీస్ స్టేషన్ కి వచ్చిన వారిని పోలీసు అధికారులు వేధిస్తున్నారు. న్యాయం చేయాల్సిన పోలీసు అధికారులు బాధితుల అన్యాయం చేస్తున్నారని రాజకీయ పలుకుబడి ఉన్న వారికి డబ్బులు ఇచ్చిన వారికి న్యాయం చేసినట్టుగా నటిస్తున్నారు. తప్ప లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ పెట్టకుండా ప్రతి పోలీస్ స్టేషన్లలో ల్యాండ్ సెటిల్మెంట్లు  చేసుకుంటూ బాధితులని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు యంపల్ల పురుషోత్తం రెడ్డి తెలిపారు.

పోలీసు అధికారులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ చూపకపోతే అధికారులపై చర్యలు తీసుకోకపోతే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అరాచక పరిస్థితులు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని దించి అంతేకాసి తోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు లాగానే పోలీసుల తోటి అమాయక ప్రజల మీద బాధితులకు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజావ్యతిరేకం మూట కట్టుకోవాల్సి వస్తదన్నారు.  పోలీస్ అధికారుల తీరుమరకపోతే ప్రతి పౌరుడు పోలీసులకి ప్రభుత్వానికి తిరగబడాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news