బిగ్ బ్రేకింగ్ః వీ6ఛాన‌ల్ పై ప‌రువున‌ష్టం దావా వేసిన మంత్రి కొప్పుల‌

-

తెలంగాణ‌లో భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల ప‌రంప‌ర ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఇక వీ6 ఛాన‌ల్ త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసింద‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ప‌రువు న‌ష్టం దావా వేశారు. తాను పెద్ద‌పల్లి జిల్లా రామగుండం మండ‌లం జ‌న‌గామ గ్రామంలో తాను చ‌ట్ట ప్ర‌కారం కొన్న 30గుంటల భూమిపై వీ6 ఛానల్ అస‌త్య ఆరోప‌ణ‌లు చేసింద‌న్నారు.

ఆ భూమి తాను క‌ష్ట‌ప‌డి కొన్నాన‌ని, కానీ వీ6 ఛాన‌ల్ అది క‌బ్జా భూమి అంటూ ఈ నెల 5న ప్ర‌సారం చేసిన క‌థ‌నం పూర్తి అవాస్త‌వం అని పేర్కొన్నారు.

ఆ క‌థ‌నం త‌న‌ను మాన‌సిక వేధ‌న‌కు గురి చేసింద‌ని, త‌మ ప‌రువుకు న‌ష్టం క‌లిగేలా ఉంద‌ని పేర్కొన్నారు. త‌న ప‌రువు న‌ష్టానికి కార‌ణ‌మైన వీ6ఛాన‌ల్ కు రూ.కోటి ప‌రువు న‌ష్టం దావా నోటీసులు పంపించారు. ప‌ది రోజుల్లోగా చెల్లించాల‌ని, లేదంటే త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతాన‌ని స్ప‌ష్టం చేశారు. ఓ మంత్రి ఛాన‌ల్‌పై ప‌రువున‌ష్టం వేయడం ఇదే మొద‌టిసారి. మ‌రి దీనిపై ఛాన‌ల్ ఎలా స్పందిస్తుందో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news