కేటీఆర్ పై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన పై కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  అమృత్ స్కామ్ లో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని.. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని కేటీఆర్ అన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన హస్తినకు వెల్లారని మంత్రులు ఆరోపించారు. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై  తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ లక్ష్మీంబాంబో.. తుస్సు బాంబో ఏదో రెండు రోజుల్లోనే తెలుస్తుందన్నారు. ఒక కేసు కే భయపడితే ఎలా..? రాబోయే రోజుల్లో అనేక కేసులు రాబోతున్నాయి. ఫోన్ ట్యాంపింగ్ చిన్న విషయం కాదన్నారు.  కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్ నిచ్చారించేందుకు మూడు రోజుల క్రితమే గవర్నర్ నుంచి క్లియరెన్స్ వస్తుందని తెలిసి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news