నాణ్యత లేకపోతే సస్పెండ్ అవుతారు.. నూతన AEEలకు సీతక్క వార్నింగ్..!

-

నూతనంగా నియమితులైన AEEలకు అభినందనలు తెలిపిన మంత్రి సీతక్క. అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలి. అంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే.. ఆ ప్రాంతాలకు రవాణా సౌకర్యం, ఇతర వసతులు కల్పించడం మీ బాధ్యత అని అన్నారు. రవాణా సదుపాయం ఉన్న ప్రాంతాలే త్వరగా అభివృద్ధి చెందుతాయి. అందుకే గ్రామీణ మూలాలు ఉన్నా మీరు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయండి. సకాలంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తిచేయాలి. అభివృద్ధి పనుల్లో మీ మార్కును చూయించండి. ఎట్టి పరిస్థితుల్లో తప్పు దారి పట్టదు.. తల్లిదండ్రులకు తలపంపులు తేవద్దు. నాణ్యత సరిగా లేకపోతే సస్పెండ్ అవుతారు అని సూచించారు.

ఇటిక మీద ఇటుక పేర్చి భవనాలు నిర్మించినట్టే.. మీ కెరీర్ ను కూడా నిర్మించుకోండి. ఒక టార్గెట్ పెట్టుకొని సకాలంలో జాగ్రత్తగా పనులు చేయాలి. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన నేను ఒక్కో అడుగు వేస్తూ ఈ స్థాయికి వచ్చాను. 10 సంవత్సరాల ఉద్యమాల్లో ఉన్న, 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న. తల్లిదండ్రుల నుంచి కష్టాన్ని నేర్చుకున్న . మన కష్టమే ప్రజల్లో మనకు ఒక స్థానాన్ని ఇస్తుంది . కష్టాన్ని ఇష్టంగా ఎంచుకొని పనిచేయండి . మీ వృత్తి ధర్మాన్ని మరవద్దు అని సీతక్క పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version