బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు మరో నిర్ణయం..!

-

బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రక్రియపై కసరత్తు చేస్తుంది. ఈ విషయం పై చర్చించడానికి రేపు సెక్రటేరీయేట్ లో భేటీ కానున్నారు బీసీ మంత్రులు. రేపు మూడు గంటలకు భేటీ కానున్నారు 8 మంది బీసీ మంత్రులు.

అయితే ఈ విషయం పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ.. బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ఎనిమిది మంది బీసీ మంత్రుల సమావేశం జరగనుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీల రక్షణకు చట్టం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీ డిక్లరేషన్ లోనూ మంత్రి నారా లోకేష్ కూడా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని మంత్రి సవిత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version