అంగన్ వాడి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రమాణ స్వీకారం రోజునే రెండు ఫైల్స్ పై సంతకం చేసి అందరినీ ఆకర్షించారు. ఇక తరువాత అసెంబ్లీ రోజు ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు,   మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

తాజాగా అంగన్ వాడి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది మంత్రి సీతక్క. శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించిన సీతక్క అంగన్ వాడి ఉద్యోగులు గుడ్ న్యూస్ చెప్పారు. 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్ వాడీలుగా అప్ గ్రేడ్ కు సంబంధించిన ఫైల్ పై మంత్రిగా తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని మంత్రి సీతక్క స్వయంగా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం రూ.7500 జీతం పొందుతున్న మినీ అంగన్ వాడీ టీచర్లు ఇకపై రూ.13,500 పొందుతారని.. ప్రతీ కేంద్రానికి ఒకరు చొప్పున మొత్తం 3989 హెల్పర్స్ ను నియమించుకోవచ్చని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news