అదే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకత : మంత్రి శ్రీదర్ బాబు

-

దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజులపాటు ఇండియా మొబైల్ కాంగ్రెస్ జరుగుతుంది. ఇందులో అనేక టెలికాం కంపెనీలకు సంబంధించిన సంస్థల ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమావేశమై చర్చించాం అని రాష్ట్ర మంత్రి శ్రీదర్ బాబు తెలిపారు. నిన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో ప్రత్యేకంగా టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని రాష్ట్రాలకు నిర్ణయం చేయొచ్చని పాలసీ నిర్ణయం చేయడం హర్షణీయం. తెలంగాణ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తెలియజేయడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రో యాక్టివ్ గా తీసుకొని విధానపర నిర్ణయం తీసుకొని పాలసీని ఇనిషియేట్ చేస్తాం. దీనివల్ల అనేక టెలికాం మ్యానుఫ్యాక్చరర్స్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. అతి త్వరలో దాన్ని తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుంటాం.

ఈ సమావేశంలో ప్రత్యేకించి ఐటీ మినిస్టర్ల సమావేశం కూడా జరిగింది. జ్యోతి రాధిక సింగ్ , పెమ్మసాని చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో ఐటీ మినిస్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ప్రభుత్వం తరఫున టీ ఫైబర్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ సంబంధించి గ్రామానికి ప్రతి ఇంటికి నెట్వర్క్ సదుపాయం కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వివరించాం. 2013లో మొదలు పెట్టినటువంటి ఈ అంశం 2014 తర్వాత భారత నెట్ అని ఫేస్ టు ఫేస్ వన్ అని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. 3000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేసుకొని అండర్ గ్రౌండ్ లో ఫైబర్ నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ నుంచి నెట్వర్క్ ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకత. నెట్వర్క్ పూర్తిస్థాయిలో కంప్లీట్ కావాలంటే నిధులు అవసరం. మాకు ఉన్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళాము. దాదాపు 1600 కోట్లకు పైగా అవసరం. వెంటనే వాటిని తెలంగాణా కు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం అని శ్రీధర్ బాబర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news