భారీ వర్షాలు.. రేపు స్కూల్స్, కాలేజీలకు సేలవు..!

-

ఏపీలో వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు అర్ధరాత్రి 12 నుండి మూడు గంటల మధ్యలో వాయుగుండం తీరం దాటుతుంది. తమిళనాడులోని పొన్నేరి సూళ్లూరుపేటలో పులికాట్ సరస్సు వద్ద ల్యాండ్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అని తిరుపతి జిల్లా‌ కలెక్టర్ వెంకటేశ్వరన్ పేర్కొన్నారు. తీరం దాటినా తరువాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తడ, సూళ్లూరుపేట, సత్యవేడు, వరదయ్యపాలెం, బిఎమ్ కండ్రిగ, దొరవారిసత్రం, కేవిబి పురం మండలాలు ప్రజలు అత్యంత అప్రమత్తం ఉండాలీ అని కలెక్టర్ సూచించారు.

ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ అధికారులు అప్రమత్తం ఉండాలీ. వచ్చె 24 గంటలు మనకు అత్యంత కీలకం. భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలందరూ అప్రమత్తం గా ఉండాలీ అని పేర్కొన్నారు. అలాగే ఈ వర్షాల నేపథ్యంలో రేపు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ కాలేజీలకు సేలవులు ప్రకటించారు కలెక్టర్. ఒకవేళ వర్షాలు ఇలానే కొనసాగితే సెలవులు పొడిగించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news