సీఎం అంటే కరెక్టింగ్ మాస్టర్.. కేటీఆర్​ ట్వీట్​కు మంత్రి కౌంటర్

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎం అంటే కటింగ్ మాస్టర్ అంటూ ఆయన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి స్కీమ్‌లు కటింగులు పెడుతుందంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ తాజా వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు వాఖ్యానించినట్టు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదని అన్నారు.

సీఎం రేవంత్ కరెక్టింగ్ మాస్టర్ అని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు, అర్హులకే సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన తేల్చి చెప్పారు. దుబారాకు దూరంగా పథకాలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని తుమ్మల పునరుద్ఘాటించారు. రైతు భరోసా అలస్యం చేయడానికి కాదని.. ఆదర్శం చేయడానికే కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news