మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఎంపీ అర్వింద్ సంచలన సవాల్..!

-

ఎట్టకేలకు నిజామాబాద్ లో పసుపు బోర్డు కేటాయిస్తూ నిన్న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఉన్నారు. తాజాగా ఢిల్లీలోని తన నివాసంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడారు. పసుపు బోర్డు కోసం రైతులు 40 ఏళ్ల పాటు శ్రమించారని తెలిపారు.

తాము పసుపు బోర్డు తీసుకొస్తామని హామి ఇచ్చాం.. తీసుకొచ్చామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పసుపు బోర్డు తీసుకొచ్చామని తెలిపారు. జాతీయ పసుపు బోర్డు తొలి చైర్మన్ గా ఎన్నికైన గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. దమ్ముంటే మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హామీ ఇచ్చిన చెరుకు ఫ్యాక్టరీని తెరిపియ్యి అని సంచలన సవాల్ విసిరారు. తుమ్మల నాగేశ్వర్ రావు టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇలా పార్టీలు మారారు. ముసలోడు అయ్యాక ఏం మాట్లాడుతారో తెలియదు అన్నారు. లేఖలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా..? అప్పుడు గుర్తుకు రాలేదా..? తుమ్మల అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news