ఇరిగేషన్ శాఖ రివ్యూ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ నిధులే అధికంగా దుర్వినియోగం అయ్యాయి. ఖర్చు చేసిన నిధులతో కొత్త ఆయకట్టు పెంచలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో సాగు నీటి ప్రాజెక్టు లను పూర్తి చేస్తాం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిదికన పూర్తి చేస్తాం. దేవాదుల ప్రాజెక్టు నుండి.. భువనగిరి పార్లమెంట్ పరిధిలోనీ భూమలకు సాగు నీటిని అందిస్తాం. అలాగే రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి సోనియా గాంధీ చేత ప్రారంభిస్తాం అని పేర్కొన్నారు.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో లోపాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సోర్సు గా దిగువన ప్రాజెక్టు లను నిర్మించలేము, సాగు నీరు ఇస్తామని హామీ ఇవ్వలేము. ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడం నా ధర్మం. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్.