వేసవిలో రాష్ట్రంలో చెరువుల పూడిక.. వానాకాలంలోపు పూర్తవ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలని నీటి పారుదల, పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జలసౌదపై ఇవాళ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఏడాది చివర నాటికి కొత్తగా 4.5 నుంచి 5 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ప్రాజెక్టుల పనులు వేగవంతం చేస్తున్నట్టు అధికారులు వివరించారు.

నీటి పారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారు. అందుకు తగిన ఫలితం రాలేదన్నారు. ఇప్పుడు అవసరమైన నిధులు వ్యయం చేసి కొత్త ఆయకట్టు సృష్టించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. కొత్తగా ప్రాజెక్టులలో నీరు అందించే విషయంలో అడ్డంకులు అన్నీ అధిగమించి సకాలంలో నీరు అందించాలని సూచించారు. రాబోయే జూన్ నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులు, ఏడాది చివర నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులు ఏడాది చివరనాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులపై పనులను వేగవంతం చేయాలన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news