మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది.. నియోజకవర్గాలలో పలు సర్వేలు నిర్వహించి.. నిత్యం ప్రజల్లో ఉండే అభ్యర్థులకే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. ఈ క్రమంలోనే మూడో జాబితాలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది.. ఒక ఎంపీ తో పాటు రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు..
తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానిని సిట్టింగ్ స్థానం నుంచే వైసిపి బరిలోకి దింపుతుంది.. పెడన అభ్యర్థిగా ఉప్పాల రాముని పెనమలూరు అభ్యర్థిగా జోగి రమేష్ ని సీఎం జగన్ కన్ఫామ్ చేశారు.. కుల సమీకరణాలు లోకల్ రాజకీయాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చి ఈ ఎంపిక చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ ముచ్చటగా మూడో నియోజకవర్గంలో నుంచి ఈసారి బరిలో ఉండబోతున్నారు..
విజయవాడ ఎంపీ స్థానాన్ని తొలుత బీసీకి లేదా ఎస్సీ కి కేటాయించాలని వైసీపీ అధిష్టానం భావించింది.. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేశినేని నానికి ఈ సీటును కేటాయించింది..కేశినేని నానికి విజయవాడ టిక్కెట్ ఇవ్వడం వెనుక సీఎం జగన్ వ్యూహం కనిపిస్తోంది.. ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓట్లను కొల్లగొట్టేందుకే నానిని బరిలోకి దింపుతున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. టిడిపి బలంగా ఉన్న నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.. వైసిపి కొన్నిచోట్ల నియోజకవర్గ ఇన్చార్జిలను సైతం మార్చేసి..
కొత్తవారికి అవకాశం కల్పిస్తోంది.. ఈ క్రమంలోనే తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధిని పక్కనపెట్టి టిడిపి నుంచి జంపైన స్వామి దాసుకు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది.. టిడిపికి బలంగా ఉన్న కమ్మ ఓట్ల పైనే వైసిపి ఫోకస్ చేసిందని జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అర్థమవుతుంది..