తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న నిర్వహించనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నవంబర్ 10న నామినేషన్లకు చివరి గడువు. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అందరూ అభ్యర్థులను ప్రకటించి.. అందరికీ బీ ఫామ్స్ అందజేసింది. దాదాపు అందరూ నామినేషన్లు వేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా చాలా వరకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ 4 స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించారు. ముఖ్యంగా మిర్యాలగూడ, సూర్యపేట, తుంగతుర్తి, చార్మినార్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.
అయితే ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ మిర్యాలగూడ అభ్యర్థిగా బీఎల్ఆర్ కే టికెట్ అని ప్రకటించాడు. సూర్యపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇవాళ రాత్రికి ప్రకటించే అవకాశముందని చెప్పుకొచ్చాడు. మరోవైపు మిర్యాలగూడ అభ్యర్థిగా బీఎల్ఆర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. బీఎల్ఆర్ నామినేషన్ కి భారీగా ర్యాలీ నిర్వహించారు. మిర్యాలగూడలో బీఎల్ఆర్ గెలవడం ఖాయమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.