CPI తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు వరంగల్ వేదికగా తాజాగా జరిగాయి. ఇందులో భాగంగా CPI రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు కీలక కామెంట్స్ చేసారు. చైతన్య వంతంగా పార్టీని బలోపేతం చేయడానికి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాం. డిసెంబర్ 25 నాటికి సిపిఐ వందేండ్లు పూర్తి చేసుకుంటుంది. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నిర్మాణం పై ఫోకస్ పెట్టాం.
అయితే BRS సృష్టించిన సంక్షోభం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయట పడలేక పోతున్నది. రుణమాఫీ వందశాతం అమలు కాలేదని రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ప్రజా వ్యతిరేకతను ముఠా కట్టుకోవద్దని కోరుకుంటున్నాము. ఇక్కడ BRS పని అయిపోయింది. ఇక బీజేపీని నిలువరించడంతో పాటు CPI బలోపేతం కోసం కృషి చేస్తాం. ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగని పక్షంలో ప్రభుత్వం కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబ శివ రావు పేర్కొన్నారు.