హరీశ్‌ కాంగ్రెస్‌లోకి వస్తే.. పాపాలు కడుక్కోవడానికి దేవాదాయశాఖ ఇస్తాం: రాజగోపాల్‌రెడ్డి

-

బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కడియం శ్రీహరిలు కాంగ్రెస్‌ను చీల్చాలని ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. వారి మాదిరిగా తాము జీ హుజూర్ బ్యాచ్‌ కాదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ లాబీలో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ చీప్‌ పాలిటిక్స్‌ మానుకోవాలని రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు.

- Advertisement -

హరీశ్ రావును తమ పార్టీలోకి రమ్మంటున్నామని, బీఆర్ఎస్‌లో అతనికి భవిష్యత్‌ లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు రైట్ పర్సన్‌ ఇన్ రాంగ్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తమపై పడిందని తెలిపారు. నల్గొండ సభ కోసం డబ్బులు పెడుతూ జగదీశ్వర్ రెడ్డి కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదని…ఉద్యమ సమయంలో పదవులను త్యజించిన చరిత్ర తమదేనన్నారు. ఇప్పుడు హరీశ్‌ రావు తనతోపాటు 25మంది ఎమ్మెల్యేలను తీసుకుని వస్తే కాంగ్రెస్‌లోకి తీసుకుంటామని చెప్పారు. హరీశ్‌కు దేవాదాయ శాఖ ఇస్తామని బీఆర్ఎస్‌లో ఉండి తాను చేసిన పాపాలను కడుక్కోవడానికి ఆ మంత్రి పదవి ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...