కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాను : ఎమ్మెల్యే రేఖానాయక్

-

తెలంగాణలో రోజు రోజుకు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ నాయకులు తాము ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే విజయం సాధిస్తామనే ధీమాలో ఉంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవలే కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో కాస్త ఆగ్రహానికి గురైంది.

 

ఇప్పటికే రేఖానాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అయింది. తాజాగా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కచ్చితంగా తాను  కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాను ఎమ్మెల్యే రేఖానాయక్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసే వరకు బీఆఱ్ఎస్ లో కొనసాగుతాను. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాను. బీఆర్ఎస్ నన్ను పక్కకు పెట్టింది. కాంగ్రెస్ నుంచే వచ్చాను.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను. ఇంకా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను. ఏ పార్టీలోకి వెళ్లలేదని.. ఎమ్మెల్యే పీరియడ్ పూర్తి కాగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఎమ్మెల్యే రేఖానాయక్ స్పష్టం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news