రోడ్డు దాటేటప్పుడు వాహనదారుడి తప్పిదం..వీడియో వైరల్

-

నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాలే బలి తీసుకుంటోంది. డ్రైవింగ్ లో ఉండగా రోడ్డు చూడకుండా బండి నడిపిస్తారు కొందరు. ఇక మరికొందరైతే సింగిల్ హ్యాండ్ తోనే వాహనం నడిపిస్తారు. ఆ సమయంలో ఏదో ఒక వాహనం పక్కనుంచి వెళ్ళినా.. ఎదురుగా వచ్చినా.. అడ్డు వచ్చినా జరగరాని ఘోరం జరిగి పోతుంది. ఓ ప్రాణం కొన్ని కుటుంబాలను, కొందరి జీవితాలను రోడ్డున పడేసే ప్రమాదం ఉంది. తాజాగా ఇలాంటి ఘటన శంషాబాద్ లో చోటు చేసుకుంది.

బైక్ పై వెళ్తున్న వ్యక్తి రోడ్డుకు ఇరువైపులా చూడకుండా రోడ్డు క్రాస్ చేస్తుండడంతో.. అటుగా వస్తున్న కారు బైక్ ని ఢీ కొట్టింది. దీంతో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన దేశంలో ఏటా రోడ్లపైకి వస్తున్న కొత్త వాహనాల సంఖ్య పెరుగుతోంది.. కానీ వాహనాల రద్దీ కి తగ్గట్లు మౌలిక సదుపాయాల కల్పన మాత్రం అంతగా ఉండట్లేదు. దీంతో ప్రమాదాలు జరిగి చాలా మంది వాహనదారులు చనిపోతున్నారు. దేశంలో యాక్సిడెంట్ కేసులో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news