బీఆర్ఎస్ MLAలకు డ్రగ్స్ టెస్ట్ లు చేయాలని పోలీసులకు ఎంపీ అనిల్ యాదవ్ విజ్ఞప్తి..!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అందరికీ డ్రగ్స్ టెస్ట్ లు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసారు ఎంపీ అనిల్ యాదవ్. డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి రాజ్ పాకాల, విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్ కి సిగ్గు ఉండాలి. కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి. గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసుని ఏ విధంగా దారి మళ్లించారో ప్రజలకు తెలుసు అని ఎంపీ అన్నారు.

ఇక జన్వాడ ఫామ్ హౌస్ అంటేనే కాంట్రవర్సీ. ఒకసారి దీపావళి పెస్టివల్, ఇంకో సారి గృహ ప్రవేశం అంటున్నారు. డ్రగ్స్ ని స్కూల్ పిల్లల వరకు తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వానిది. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసుల ముందు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడు. రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి ఒప్పుకుండు. ఇప్పుడు స్టేట్మెంట్ ను మారుస్తుండు. ఫామ్ హౌస్ దొర కేసిఆర్ డిజిపికి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుండు అని ఎంపీ అనిల్ యాదవ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news