మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..!

-

మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బుధవారం లోక్ సభలో ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకం అని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం ఓబీసీ, ముస్లిం మహిళల గురించి ఈ బిల్లులో ప్రస్తావన లేదని చెప్పారు. కేవలం అగ్ర వర్ణాల మహిళలను మాత్రమే మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని చూస్తొందని విమర్శించారు.

ముస్లిం మహిళల జనాభా 7 శాతం ఉందని లోక్ సభలో వారి ప్రాతినిథ్యం కేవలం 0.7 శాతం మాత్రమే ఉందన్నారు ఒవైసీ. ముస్లిం మహిళలు చదువులో కూడా వెనుకబడి ఉన్నారని.. వారికి రిజర్వేషన్ సద్వినియోగంకావాలని కోరారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. నెహ్రూ, సర్దార్ పటేల్ రాజ్యాంగ సభలో ముస్లింలపై వివక్ష చూపించారన్న ఒవైసీ వారు నిజాయితీగా ఉంటే ముస్లింలకు ప్రాతినిధ్యం ఉండేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీలకు న్యాయమైన వాటాను ఈ బిల్లు నిరాకరించిందని ఒవైసీ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news