ఆ 40 సీట్లే ‘కీ’..టీడీపీ-జనసేన ఫోకస్.!

-

టిడిపి-జనసేన పొత్తు ప్రకటించిన దగ్గర నుండి రాష్ట్రం మొత్తం పొత్తులో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అనే విషయం పైన చర్చ నడుస్తోంది. టిడిపి వారు జనసేనకి 35 నుంచి 40 ఎమ్మెల్యే స్థానాలు, 3 నుంచి 5 ఎంపి స్థానాలు ఇవ్వాలని యోజనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014 ఎన్నికలలో జనసేన పోటీ చేయకపోయినా, టిడిపికి మద్దతు తెలుపటం వలన టిడిపి విజయం సాధించిందని జనసేన వర్గాలు అంటున్నాయి.

2019 ఎన్నికలలో జనసేన, టిడిపి విడివిడిగా పోటీ చేయడం వల్ల 40 స్థానాలలో గెలిచే అవకాశం ఉన్న టిడిపి ఓటమిపాలైందని జనసేన వర్గాల అంచనా. ఇప్పుడు ఆ 40 స్థానాలలో జనసేన పోటీ చేసి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. టి‌డి‌పి కోల్పోయిన 40 స్థానాలలో స్వల్ప మెజారిటీతో వైసిపి విజయం సాధించింది. టిడిపి, జనసేన వేర్వేరుగా పోటీ చేయడం వలనే వైసీపీ కి విజయం దక్కిందని జనసేన నాయకులు అంటున్నారు.

ఈసారి ఆ తప్పిదం చేయకూడదని టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తున్నారని పవన్ ప్రకటించారు. 2019 రాజకీయ సమీకరణాల అనుగుణంగానే వాటిని అంచనా వేసి ఈసారి కచ్చితంగా రాష్ట్రంలో టిడిపి, జనసేన కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, వైసీపీని ఓడిస్తాయని జనసేన వర్గాలు అంటున్నాయి.

అంటే గత ఎన్నికల్లో కలిసి పోటీ టి‌డి‌పి-జనసేన పోటీ చేసి ఉంటే అధికారంలోకి రాకపోయినా కనీసం 60 స్థానాల వరకు గెలుచుకునేవి అని అంచనా..అప్పుడు వైసీపీకి 151 సీట్లు వచ్చేవి కాదు. ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత ఉందని, పైగా టి‌డి‌పి-జనసేన కలవడం వల్ల..ఆ ప్రభావంతో ఖచ్చితంగా 40 సీట్లు గెలుస్తామని, అటు టి‌డి‌పి ఖచ్చితంగా సొంత బలంతో 40 సీట్లు వరకు గెలుస్తుందని, ఇటు జనసేన 10 సీట్లు వరకు గెలుచుకుంటుందని, మొత్తం మీద 90-100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామనేది టి‌డి‌పి-జనసేన అంచనా. మరి వీరి వ్యూహం ఫలించి టిడిపి జనసేన అధికారంలోకి వస్తాయా? లేదా? వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news