వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగి దాడి ఘటన పై కేటీఆర్ కుట్ర దాగి ఉన్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఎవనిది కుట్ర..? ఏంది ఆ కుట్ర..? నీకు ఓటు వేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా..? అని ఫైర్ అయ్యారు. ఈ ట్వీట్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల.
“నీది రా కుట్ర.. నీ అయ్యది రా కుట్ర. తరతరాలకు సరిపోయే భూమిని ఒక దశాబ్దంలోనే దోచిన నీది రా కుట్ర. నీ కుటుంబానిది రా కుట్ర. ఫాంహౌస్ ల కోసమో.. రిసార్టుల కోసమో కాదు రా. ఉద్యోగ ఉపాధి అవకాశాల సృష్టికి మా ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న నీది రా కుట్ర పదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేసి బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిన మీది రా కుట్ర. మల్లన్న సాగర్ ను కన్నీటి సాగర్ గా మార్చిన మీదిరా కుట్ర. రంగ నాయక సాగర్ ను రక్తాలు పారే సాగర్ గా మార్చిన మీది రా కుట్ర. అరెస్టు.. అరెస్టు.. అరెస్టు అని తెగ కలవరిస్తున్నావు.. ఇది కదా నీ అసలు భయం” అంటూ ట్వీట్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.