ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నడూ ఊహించని రీతిలో భారీ విజయం సాధించడంతో నారా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు వారికి మంత్రుల శాఖలను కూడా కేటాయించారు.

మంత్రులు మినహా మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 21, 22 రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. శాసన సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు 24న ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.  అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news