నిరుద్యోగులకు అలర్ట్..SI, కానిస్టేబుల్ ఫలితాలకు ముహుర్తం ఫిక్స్ !

-

తెలంగాణ రాష్ట్రంలోని కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్. SI, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఫలితాల విడుదల దశకు చేరుకుంది. ఆగస్టు 3వ వారంలో SI ఫలితాలను, సెప్టెంబర్ 2వ వారంలో కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

EWS రిజర్వేషన్ల కోసం పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాల విడుదల మూడో వారానికి వాయిదా పడ్డట్లు TSLPRB వర్గాలు తెలిపాయి. కోర్టు అడిగిన ప్రశ్నలకు బోర్డు సమాధానం ఇచ్చిన వెంటనే ఫలితాలు విడుదలవనున్నాయి. కాగా,  ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్​ను కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

ఇవాళ ఉదయం 6గంటల నుంచి 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అదే విధంగా రాష్ట్రం లోని ప్రైవేట్ వైద్య దంత  కళాశాలల్లో  ఎంబీబీఎస్, బీడీఎస్​ కోర్సుల ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news