రైతులు బాగుండాలి అనేది నా ఆశయం : మంత్రి తుమ్మల

-

సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచి పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక పంట దిగుబడిని సాధించడమే కాకుండా, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం విశేషంగా కృషి చేయాలి. తద్వారా రైతులకు మంచి మద్దతు ధర లభించేలా మార్కెటింగ్ శాఖా అధికారులు కృషి చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తరకం పంటలను రైతులకు పరిచయం చేయాలి.

- Advertisement -

వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, ఆ పంటలను పండిచేందుకు వాళ్లను మానసికంగా సంసిద్ధం చేయాలి. మామిడి, జామ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆ పంటల సాగుకు సహాయపడాలి. పాం ఆయిల్ పంట సాగు చేసే రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారు. వాళ్లకు మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. ఆ సాగును మరింత ప్రోత్సహించాలి. అందులో అంతర పంటగా పుచ్చకాయలు  పండించే విధంగా ప్రోత్సహించాలి. రైతు బాగు పడితే మిగిలిన అన్ని రంగాలు బాగు పడతాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉంటంది. రైతు బాగుండాలి అనేది నా ఆశయం అని తెలిపారు మంత్రి తుమ్మల

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...