హైదరాబాద్ లో జరిగిన మహిళా సాధికారిత కార్యక్రమంలో తన కుటుంబం గురించి కేటీఆర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మా తల్లిని చూసి ఎంతో నేర్చుకున్నామని.. మా చెల్లి కవిత చాలా డైనమిక్ అని తెలిపారు. మా కుటుంబంలో మా చెల్లి అంత ధైర్యవంతులు ఎవ్వరూ లేరు అన్నారు. ఇక నా భార్యకు కూడా ఓపిక చాలా ఎక్కువ. కూతురు పుట్టాక నా జీవితం చాలా మారిపోయిందన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు కేటీఆర్.
ముఖ్యంగా మ్యానిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించాం. ప్రభుత్వ దవాఖానల్లో మహిళలు, గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామ్నారు. దీంతో దవాఖానల్లో డెలివరీల శాతం పెరిగింది. మైనార్టీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశాం. దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్‌ల కోసం వి-హబ్‌లు ఏర్పాటు చేశాం. దీంతో మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారని తెలిపారు.