కేసీఆర్ ఉనికి లేకుండా చేయడమే నా టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుచ చేశారు. తాజాగా చిట్ చాట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక సంవత్సరం తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తా.. ఏడాది తరువాత కేసీఆర్ రాజకీయం ముగుస్తుంది. ఆ తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తానన్నారు. కేటీఆర్ తోనే కేసీఆర్ ఉనికి లేకుండా చేశామని.. అలాగే హరీశ్ రావును వాడుకొని కేటీఆర్ ని లేకుండా చేస్తామన్నారు. బావ, బావమరుదులను ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు అన్నారు.
ముఖ్యంగా మూసీ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. 33 బృందాలతో ఇప్పటికే సర్వే చేయించామని.. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ కి నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలువనున్నట్టు తెలిపారు. మూసీ నిర్వాసితులకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని ప్రకటించారు. మొదటి విడతలో బాపూఘాట్ నుంచి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. దాదాపు 30 కిలోమీటర్ల మేరకు పునరుజ్జీవ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. వారికి అన్ని సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. రూ.140 కోట్లతో డీపీఆర్ తయారీకి ఆదేశాలిచ్చామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవ ప్రక్రియ పై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పీపీపీ విధానంలోనే మూసీ ప్రక్షాళన జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.