కొండా సురేఖ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాగార్జున అభిమానులు…!

-

వరంగల్ లో మంత్రి కొండ సురేఖకు నిరసన సెగ తగిలింది. అక్కినేని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ పై అక్కినేని అభిమానులు ఫైర్ అయ్యారు. పాపయ్య పేట చమన్ జంక్షన్ లో కొండా సురేఖ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు నాగార్జున అభిమానులు. అక్కినేని కుటంబం ఇంటికి వెళ్లి.. స్వారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

కొండా సురేఖ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాగార్జున అభిమానులు…!

ఇక అదే సమయంలో…వరంగల్ లో బీఆర్‌ ఎస్‌ పార్టీ నేతలు నిరసనకు దిగారు. మాజీ మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు వరంగల్ లేబర్ కాలనీ చౌరస్తాలో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకోకు దిగాయి టిఆర్ఎస్ శ్రేణులు. అధిక సంఖ్యలో రాస్తారోకోలో పాల్గొన్న టిఆర్ఎస్ కార్యకర్తలు..కొండా సురేఖకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news