నందిగం సురేష్ రిమాండ్ పొడగింపు

-

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్ ని పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనని కోర్టులో హాజరు పరిచారు.

 

కాగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ రెండోసారి కోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో సురేష్ ని పోలీసులు నేడు మంగళగిరి కోర్టులో మరోసారి హాజరుపరచగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 17 వరకు సురేష్ రిమాండ్ ని పొడిగిస్తున్నట్లు ఆదేశించింది.

దర్యాప్తు కీలక దశలో ఉన్న ఈ సమయంలో బెయిల్ ఇస్తే ప్రతికూల ప్రభావం చూపుతుందని, దాడి ఘటనలో సురేష్ పాత్ర ఉందని, ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు, సహ నిందితులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. సురేష్ కి నేర చరిత్ర ఉందని, మెజిస్ట్రేట్ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో న్యాయస్థానం ఈనెల 17 వరకు రిమాండ్ ను పొడిగించింది.

Read more RELATED
Recommended to you

Latest news