తెలంగాణ‌కు నారా భువ‌నేశ్వ‌రి సాయం.. ఏంటో తెలుసా?

ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కు ఎంత డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే చాలామంది ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోయారు. అయితే చాలా మంది ఆక్సిజ‌న్ ఏర్పాట్లు చేసేందుక ముందుకొస్తున్నారు. సోనూసూద్ లాంటివారు నిత్యం ప్ర‌జ‌ల‌కు ఆక్సిజ‌న్ అందిస్తున్నారు. అయితే ఇప్పుడు నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి తెలంగాణకు సాయం అందిస్తున్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవ‌ల్లో భాగంగా తెలంగాణలో మరో రెండు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు భువనేశ్వరి స్ప‌ష్టం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్లాంట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేశామ‌ని వివ‌రించారు.

ఈ కరోనా కష్టకాలంలో కరోనా పేషెంట్లకు త‌మ‌వంతు సాయం చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక ముందడుగు వేసిందన్నారు భువనేశ్వరి. అయితే త‌మ ట్ర‌స్టుకు సాయం చేస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆమె. ఇప్ప‌టికే అనాథ శవాల అంతిమ సంస్కారాలకు ట్రస్ట్ సేవా విభాగం ఏర్పాట్లు చేస్తున్నట్టు వివ‌రించారు. టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు చేస్తున్న‌ట్టు వివ‌రించారు.