Anushka : ప్రభాస్‌ హీరోయిన్‌ తో చిరంజీవి రొమాన్స్‌ ?

-

Anushka : ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో అందరి మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది.

Anushka in Mega Star chiranjeevi Movie

అయితే…. మెగాస్టార్ చిరంజీవి, బింబిసార డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. ఇందులో అనుష్క శెట్టిని హీరోయిన్గా తీసుకోవాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అందుకు చిరంజీవి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యువి క్రియేషన్స్ సంస్థ భారీవ్యయంతో ఈ మూవీని రూపొందించనుంది. కాగా.. ఈ సినిమాలో సీతా రామం బ్యూటీ మృనాల్ ఠాకూర్  ను కూడా అనుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version