సోల్జర్నంటూ యువతులకు వల.. రూ.8 కోట్లు స్వాహా..!

-

మిలిటరీ అధికారినంటూ ఓ వ్యక్తి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. కోట్లలో డబ్బులు కాజేశాడు. ప్రకాశం జిల్లా కీలకంపల్లి గ్రామం, పాలుకురల్ల తండాకు చెంది ముడావత్ శ్రీనునాయక్ అలియాస్ శ్రీనివాస్ చౌహాన్ (42) నిరుద్యోగి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, సైనిక్ పురిలో నివాసముంటున్నాడు. తొమ్మిదో తరగతి వరకు చదివిన శ్రీను పోస్ట్ గ్రాడ్యుమేషన్ చేసినట్లు నమ్మించేవాడు. మేఘాలయ సీఎంజే యూనివర్సిటీలో ఎంటెక్ (ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్) చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించుకున్నాడు.

Soldier
Soldier

2002లో గుంటూరులోని డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ హోదాలో ఉన్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. శ్రీనినాయక్ కుటుంబం గుంటూరు జిల్లా వినుకొండలో నివాసముంటోంది. 2014లో శ్రీనివాస్ హైదరాబాద్ కు వచ్చేశాడు. శ్రీనివాస్ చౌహాన్ పేరిట తీసుకున్న ఆధార్ కార్డును ఆర్మీ అధికారిగా మార్చుకున్నాడు. సోషల్ మీడియాలో ఆర్మీ అధికారి దుస్తుల్లో డీపీ పెట్టుకున్నాడు.

వరుడు కోసం ఎదురుచూస్తున్న ఓ అమ్మాయికి తన బయోడేటాను పంపించాడు. అమ్మాయి కుటుంబ సభ్యులతో ఆర్మీ దుస్తువుల్లో ఉండి ఆన్ లైన్ లో మాట్లాడేవాడు. మొదట్లో తనకు కట్నం వద్దని అమ్మాయి కుటుంబాన్ని నమ్మించాడు. చనువు పెరిగిన తర్వాత ఏదో అవసరం ఉందని రూ.లక్షల్లో దండుకునేవాడు. అలా ఉప్పల్ లో ఓ గదిని అద్దెకు తీసుకుని దానిని ఆర్మీ అధికారి కార్యాలయంగా మార్చుకున్నాడు. ఆ గదిలో నుంచి అమ్మాయిలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడేవాడు.

హైదరాబాద్ లోని సచివాలయం అధికారి మెడికల్ చదివిన కూతురుంది. ఆమెతో పెళ్లి పత్రికల వరకు వచ్చాక అవసరం ఉందని రూ.56 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. అలాగే వరంగల్ కు చెందిన ఓ కుటుంబం నుంచి రూ.2 కోట్లు తీసుకున్నాడు. మరో అమ్మాయికి తాను ఖరగ్ పూర్ లో ఐఐటీ చేశానని నమ్మించి రూ.76 లక్షలు కాజేశాడు. ఆర్మీ మేజర్ అని తన సొంత భార్యను కూడా నమ్మించాడు. ఇటీవల ఆమె నుంచి కూడా రూ.65 లక్షలు తీసుకున్నాడు. ఇలా ఏకంగా 17 మంది అమ్మాయిలకు మోసం చేశాడు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా, శనివారం కారులో మరో అమ్మాయిని మోసం చేయడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news