తెలంగాణాలో ముగ్గురికి ఎమ్మెల్సీ ఛాన్స్ .. ఎవరెవరికంటే ?

-

కొద్ది క్షణాల ముందే తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ఇవాళ ఆమోదం తెలపనున్నారు. నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్, రాములు నాయక్ ల పదవీ కాలం పూర్తి కావడంతో ఆ మూడు స్థానాలను భర్తీచేయనున్నారు. ముగ్గురు ఎమ్మెల్సీలు రేపే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

గ్రేటర్ ఎన్నికల్లో ఈ ముగ్గురూ ఎక్స్‌ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునేలా ప్లాన్ చేశారని అంటున్నారు. గాయకుడు, కవి గోరేటి వెంకన్న, మాజీమంత్రి బస్వరాజు సారయ్య, దయానంద్ లను గవర్నర్‌ కోటాలో శాసనమండలికి పంపే అవకాశముంది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసి ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news