రాబోయే 10 రోజులు అత్యంత కీలకం – మంత్రి గంగుల

-

నేడు ధాన్యం సేకరణ అంశాలపై కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ లో పలు కీలక సూచనలు చేశారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. రైస్ మిల్లుల వద్ద స్పేస్ లేకున్నా… మిల్లులు సహకరించకున్నా… తక్షణం ఇంటర్మీడియట్ గోడౌన్లలో ధాన్యం దించాలని సూచించారు. గతం కన్నా ఈసారి 10 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సేకరణ చేస్తున్న జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.

రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలని.. రాజకీయాలు పట్టించుకోకుండా రైతులకు అండంగా ఉండాలన్నారు. తాలు, తరుగు సమస్య ఉత్పన్నం కావద్దన్నారు గంగుల. అందుకు రైతులు ఖచ్చితంగా ఎఫ్.ఏ.క్యూ ధాన్యం తెచ్చేలా చూడాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామన్నారు. నీళ్లు, కరెంటుతో పాటు ఎంఎస్పీతో కొనుగోళ్లు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ప్రతీ కలెక్టర్ తోనూ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ట్రాన్స్ ఫోర్ట్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ట్రాక్టర్లను సైతం వాడుకోవాలని సూచించారు. పక్క రాష్ట్రాల్లో కొనుగోళ్లు లేనందున ఆ ప్యాడీ రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే పదిరోజులు అత్యంత కీలకం అని.. యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news